మునుగోడు ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టే కాంగ్రెస్ కు రాజీనామా చేశా – రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టే కాంగ్రెస్ కు రాజీనామా చేశాన్నారు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి. చుండూరులో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. చౌటుప్పల్, నారాయణ పురం మండల కేంద్రాల్లో ఆరోపణలు చేస్తూ పోస్టర్లు వేశారు. రాత్రికి రాత్రి ఆటోల్లో పిరికిపందల్లా వచ్చి అతికించిపోయారు. రాజగోపాల్ అమ్ముడు పోయారంటూ అందులో ఉంది.నేనంటే గిట్టనివాళ్లే చేస్తున్నారు. 12 మంది‌ ఎమ్మెల్యేలు పోయిన నాడే పార్టీ మారేవాడిని. భూ నిర్వాసితులకు న్యాయం చేయమని, రోడ్లు నిర్మించాలని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, బెల్ట్ షాపులు తొలగించాలని, చౌటుప్పల్ లో‌ కాలుష్యం పై పోరాటం చేస్తూనే ఉన్నా. తెలంగాణలో ప్రాజెక్టుల రీ డిజైనింగ్ లో అవినీతిపై పోరాటం చేశా. నిజంగా అమ్ముడుపోయే వ్యక్తి ప్రభుత్వంపై పోరాటం చేస్తాడా?, ఒక పార్టీలో గెలిచి పార్టీ ఫిరాయించిన వ్యక్తులను పట్టించుకోలేదు.

అవినీతి, కుటుంబ పాలన‌పోవాలనే పార్టీ మారుతున్నా. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలహీన‌పడింది. గట్టుప్పల‌ మూడున్నరేళ్లుగా ఎందుకు ఇవ్వలేదు. అమిత్ షాని కలవగానే మండలం‌ ఇవ్వలేదా?, నా రాజీనామాతో తెలంగాణా వ్యాప్తంగా పది లక్షల పించన్లు రాలేదా?, నా రాజీనామా వల్ల ఎన్నో మార్పులు వస్తున్నాయన్నారు. గతంలో టీఆర్ఎస్ నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చినా పోలేదు. అలాంటిది ఇప్పుడు కాంట్రాక్టుల కోసం పార్టీ మారుతానా?, నిజాయితీగా నైతిక విలువలకు కట్టుబడి బీజేపీలో‌ చేరుతున్నా’ అని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేసారు. ఇక ఈ నెల 21 న మునుగోడు లో కేంద్ర మంత్రి అమిత్ షా సభ లో రాజగోపాల్ రెడ్డి బిజెపి లో చేరబోతున్నారు.