కాంగ్రెస్ కు మరో షాక్ : బీజేపీలోకి మర్రి శశిధర్ రెడ్డి..?

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ కి మరో షాక్ తగలబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కీలక నేతలంతా టిఆర్ఎస్ , బిజెపి లలో చేరగా..తాజాగా మరో సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సైతం బిజెపి గూటికి చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. రెండు రోజుల క్రితం మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ వివిధ బీజేపీ అధిష్టాన నేతలతో సమావేశం కాగా , నిన్న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ కావడం తో శశిధర్ ..కాంగ్రెస్ ను వీడనున్నట్లు తెలుస్తుంది.

గతంలో కాంగ్రెస్‌లో ఉన్న డీకే అరుణ.. బండి సంజయ్ మర్రి శశిధర్ రెడ్డిని అమిత్‌షా దగ్గరకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికకు సంబంధించి ఇరు నేతలు చర్చించారు. హైదరాబాద్ వెళ్లి కార్యాకర్తలతో మాట్లాడి.. మర్రి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. జేపీ నడ్డా సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నట్టు సమాచారం. అమిత్ షా భేటీ సందర్భంగా బీజేపీ నేతలు ఎంపీ అరవింద్ నివాసంపై దాడి గురించి చెప్పారు. దీంతో అమిత్ షా.. వెంటనే ఫోన్లో అరవింద్‌తో మాట్లాడారు.

ఇక కొన్ని నెలల క్రితం మునుగోడు మాజీ ఎమ్యెల్యే రాజగోపాల్‌ రెడ్డి పార్టీ మారటం.. తర్వాత ఉప ఎన్నికలు రావడం జరిగాయి. అయితే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, శ్రవణ్‌, మర్రి శశిధర్‌, ఇలా వరుసగా కీలక నేతలు పార్టీలు మారుతుండడం.. కలవరపెడుతోంది.