ధమాకాలో బెస్ట్‌ మూమెంట్స్‌ అదే అంటూ చెప్పుకొచ్చిన శ్రీలీల

పెళ్లి సందD మూవీ తో తెలుగు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల..ప్రస్తుతం ధమాకా మూవీ తో ఈ నెల 23 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. త్రినాధ్ నక్కిన డైరెక్షన్లో రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటీకే చిత్ర సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ఇలా ప్రతిదీ సినిమా ఆసక్తి నింపగా..తాజాగా చిత్ర ప్రమోషన్ లలో పాల్గొన్న శ్రీలీల సినిమా తాలూకా విశేషాలు తెలిపి ఆకట్టుకుంది.

నా మొదటి సినిమా (పెళ్లిసందD) సమయంలో అందరూ ఎక్కువగా కొత్తవాళ్లే, కానీ ధమాకా సినిమాలో స్టార్‌తో పనిచేశా. రవితేజగారితో పనిచేసిన తర్వాత నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది.. రవితేజ నాకు ప్రోత్సాహాన్ని అందించి.. చాలా సౌకర్యవంతంగా పనిచేసేలా చేసారని చెప్పుకొచ్చింది. రవితేజ టైమింగ్‌తో బ్యాలెన్స్ అవుతూ.. నటించడం నాకు కొంత కష్టమైంది. అయితే రవితేజ నాకు మార్గనిర్దేశం చేసేవారు. ఆయనకు ఏదైనా సన్నివేశంలో నా హావభావాలు నచ్చితే నన్ను ప్రశంసించేవారు. రవితేజ సార్‌ చాలా టాలెంట్‌ ఉన్న వ్యక్తి.. అందరికీ ఎంతో సపోర్టుగా ఉండేవారని తెలిపింది. ఇక స్పెయిన్‌లో జింతాక్‌ జింతాక్ పాటను షూట్‌ చేస్తున్నపుడు నా కాస్ట్యూమ్స్‌ సూట్‌కేసు మిస్సయింది. కొంత ఆందోళనతో ఈ విషయాన్ని నా టీంకు చెప్పాను. ఆ తర్వాత డైరెక్టర్‌, డీవోపీ షాపింగ్ కోసం రెండుమూడు గంటలు ప్రయాణం చేశారు. ధమాకా ప్రయాణంలో క్యూట్ మూమెంట్‌ ఇదే అని చెప్పుకొచ్చింది.