రేపటి నుండి తెలంగాణలో చీరాల పంపిణీ..

Bathukamma Sarees Distribution Starts In Telangana

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు గురువారం నుండి బతుకమ్మ చీరాల పంపిణి జరగబోతుంది. రాష్ట్రంలోని నేతన్నలకు చేయూతనివ్వడంతోపాటు, ఆడబిడ్డలకు చిరుకానుక ఇవ్వాలన్న లక్ష్యంతో బతుకమ్మ చీరాల పంపిణీ కార్యక్రమాన్ని 2017లో ప్రారంభించిన విషయం తెలిసిందే, బతుకమ్మ సందర్బంగా ప్రతి ఆడపడుచుకు తెలంగాణ సర్కార్ చీరలను అందజేస్తూ వస్తుంది. కాగా రేపు రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ జరగనుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

చీరల పంపీణీ కార్యక్రమం కోసం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ తమ టెక్స్ టైల్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, ఈ ఏడాది సూమారు కోటి బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇక గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా వెరైటీ డిజైన్ లను రూపొందించారు. ఈసారి 17 కొత్త వర్ణాలతో 17 డిజైన్స్‌లతో కలిపి మొత్తం 240 డిజైన్స్‌లో ఈసారి బతుకమ్మ చీరలను తయారు చేయించారు. గత ఏడాది 96 లక్షల చీరల పంపిణీ చేశారు. ఈ ఏడాది 10 వేల మంది చేనేత కార్మికులతో ఆరు నెలల నుంచి కోటి 18 లక్షల చీరలు తయారు చేయించడం జరిగింది. అలాగే ఈ ఏడాది 340 కోట్ల రూపాయిలను చీరలకు ఖర్చు చేసింది ప్రభుత్వం. గడిచిన 5 సంవత్సరాలుగా బతుకమ్మ చీరలతో చాలా మందికి ఉపాధి లభిస్తుంది. 24 గంటల కరెంట్ ఉండడంతో 3 షిఫ్ట్‌లో కూలీలు పని చేస్తున్నారు.