దసరా డైరెక్టర్ తో చిరు..ఇది నిజమేనా..?

దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తో మెగాస్టార్ ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త ..ఇప్పుడు ఫిలిం సర్కిల్లో వైరల్ గా మారింది. నాని – కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన దసరా మూవీ శ్రీరామ నవమి కానుకగా పాన్ ఇండియా గా పలు భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ వారం రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. మొదటి సినిమాతోనే శ్రీకాంత్ బ్లాక్ బస్టర్ కొట్టి అందరి కన్ను ఆయనపై పడేలా చేసుకున్నాడు. చిన్న హీరోల దగ్గరి నుండి పెద్ద హీరోలు , నిర్మాతలు శ్రీకాంత్ తో పనిచేయాలని తహతహలాడుతున్నారు.

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సైతం శ్రీకాంత్ తో ఓ సినిమా చేయాలనీ అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవితో సినిమా చేయడం కోసం సీనియర్ దర్శకుల నుంచి జూనియర్ దర్శకుల వరకూ చాలామంది క్యూలో ఉంటారు. వాళ్ల ఆశలకు తగ్గట్టే చిరు సైతం కొత్త వాళ్లతో పనిచేయడానికి నేను సైతం సిద్దం అంటున్నారు. కొత్త కథలు రెడీగాఉంటే వినడానికి రెడీ..మెప్పించడానికి మీరు సిద్దమా? అంటూ సవాల్ విసురుతున్నారు. ఈ క్రమంలో శ్రీకాంత్ కూడా చిరంజీవి కి లైన్ వినిపించారుట. ఆ లైన్ నచ్చడంతో డెవలెప్ చేయమని శ్రీకాంత్ కు చెప్పినట్లు ..ప్రస్తుతం శ్రీకాంత్ ఆ పనుల్లో ఉన్నట్లు సమాచారం.