గోదావరి ఉధృతికి యానం అతలాకుతలం

గతంలో ఎన్నడూ లేని విధంగా యానాంను గోదావరి ముచ్చెత్తింది. సుమారు వారం రోజుల పాటు తెలంగాణ తో పాటు ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం లో 36 ఏళ్ల తర్వాత గోదావరి నీటిమట్టం 70 అడుగులకు చేరి భద్రాచలం లోని పలు కాలనీ లను సైతం ముచ్చెత్తింది. ఇక ముంపు గ్రామాలు గత వారం రోజులుగా నీటిలోనే తేలుతున్నాయి. ఇక ధవళేశ్వరం బ్యారేజ్ కు భారీ వరద వచ్చి చేరుతుండడంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగించారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 25 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని అధికారులు కిందకు విడుదల చేయడంతో యానాం అంత వరద మాయం గా మారింది.

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు యానంలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అయ్యన్న నగర్ దగ్గర్లో గోదావరి గట్టుకు గండిపడటంతో యానాం జలదిగ్బంధంలో చిక్కుకుంది. దాంతో కేవలం ముప్పై నిమిషాల్లోనే చాలా కాలనీల్లో నడుము లోతు నీళ్లు వచ్చాయి. యానాంలో అయితే ఇప్పటికీ పలు కాలనీలు నీటిలోనే ఉన్నాయి. వరద ప్రభావం మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. గోదావరికి దగ్గరలో ఉన్న ఎనిమిది గ్రామాలు పూర్తిగా మునిగిపోవడంతో వారందర్నీ పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో గోదావరి వరద కూడా తగ్గుముఖం పడుతుంది.