రూ.2 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న ధమాకా బ్యూటీ..?

ధమాకా బ్యూటీ శ్రీలీల పేరు ఇప్పుడు ఇండస్ట్రీ లో తెగ చక్కర్లు కొడుతుంది. చిన్న హీరోల దగ్గరి నుండి అగ్ర హీరోలు , దర్శక నిర్మాతలు అంత శ్రీలీల జపం చేస్తున్నారు. ధమాకా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శ్రీలీల..ప్రస్తుతం యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల పక్కన కూడా జోడి కడుతూ వస్తుంది. రామ్ , నితిన్ , వైష్ణవ్ తేజ్, పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, మహేష్ ల సరసన నటిస్తుంది.

అలాగే సీనియర్ నటుడు బాలకృష్ణ – అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కబోయే చిత్రంలో బాలకృష్ణ కూతురి గా నటించబోతుంది. ఇలా వరుస సినిమాల తో బిజీ గా ఉన్న ఈ బ్యూటీ..తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచినట్లు ఫిలిం సర్కిల్లో మాట్లాడుకుంటున్నారు. బాలకృష్ణ మూవీ కి గాను రూ. 80 లక్షలు తీసుకున్న ఈ భామ..కొత్త చిత్రాలకు ఏకంగా రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తుందట. ఆమె అడిగినంత ఇవ్వడానికి కూడా నిర్మాతలు వెనుకడుగు వెయ్యడం లేదని అంటున్నారు. మరి నిజంగా శ్రీలీల అంత డిమాండ్ చేస్తుందా..లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.