పవన్ మూవీ సెట్ లో సందడి చేయబోతున్న ధమాకా బ్యూటీ

ధమాకా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శ్రీలీల..ప్రస్తుతం యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల పక్కన కూడా జోడి కడుతూ వస్తుంది. రీసెంట్ గా రవితేజ సరసన ధమాకా మూవీ లో నటించింది. ప్రస్తుతం రామ్ , నితిన్ , వైష్ణవ్ తేజ్ సరసన జోడి కట్టబోతుంది. అలాగే సీనియర్ నటుడు బాలకృష్ణ – అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కబోయే చిత్రంలో బాలకృష్ణ కూతురి గా నటించబోతుంది. ఇలా వరుస సినిమాల తో బిజీ గా ఉన్న ఈ బ్యూటీ..పవన్ కళ్యాణ్ కు జోడిగా నటించబోతుంది.

గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో పవన్ కు జోడి గా నటించబోతుంది. ఏప్రిల్ 05 నుండి ఈ మూవీ సెట్స్ పైకి రాబోతుండగా..ఏప్రిల్ 10 న శ్రీ లీల చిత్ర సెట్ లో జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో మరో నాయికగా మాళవిక మోహనన్ కనిపించనుంది. మైత్రీ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఇక పవన్ విషయానికి వస్తే ఓ పక్క రాజకీయాలు , మరోపక్క సినిమాలతో బిజీ గా ఉన్నారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు, వినోదాయ సిథం తో పాటు సుజిత్ డైరెక్షన్లో మరో మూవీ చేస్తున్నాడు. ఇలా వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.