భారత్ పై ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు

భారత్ తప్పుడు అజెండాకు ఇది కొనసాగింపు

Imrankhan
Imrankhan

ఇస్లామాబాద్‌: జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ రియాజ్ ను మన భద్రతా బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈఘటన భరించలేకపోతున్న ‌పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోమారు భారత్‌పై ఆరోపణలు గుప్పించారు. పాకిస్థాన్ ను లక్ష్యంగా చేసుకుని భారత్ చేబడుతున్న తప్పుడు ఆపరేషన్ల విషయమై ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నానని ఆయన అన్నారు. నియంత్రణ రేఖ వెంబడి చొరబాట్లు జరుగుతున్నాయన్న నిరాధార ఆరోపణలే భారత్ తప్పుడు అజెండాకు కొనసాగింపు అని ఆరోపించారు. కశ్మీర్ లో జరుగుతున్న అల్లర్లను స్థానిక అల్లర్లుగా ఆయన అభివర్ణించారు. అధికార పార్టీ బిజెపి తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబట్టిన ఇమ్రాన్, ఆ నిర్ణయాల వల్లే దక్షిణాసియాలో శాంతికి భంగం వాటిల్లుతోందని ఆరోపించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/