IPL 2023 ఓపెనింగ్ వేడుకల్లో డాన్స్ తో అదరగొట్టిన రష్మిక

యావత్ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న IPL సీజన్ 16 మొదలైంది. ఓపెనింగ్ సెర్మనీలో పాపులర్‌ బాలీవుడ్‌ సింగ‌ర్ అర్జిత్ సింగ్ త‌న పాటలతో అభిమానుల్లో ఉత్సాహం నింపగా.. టోల్వుడ్ హాట్ బ్యూటీస్ త‌మ‌న్నా , పుష్ప ఫేమ్ రష్మిక బాలీవుడ్, టాలీవుడ్ సాంగ్స్‌ కు డాన్స్ లతో రచ్చ చేసారు.

రష్మిక పుష్పలోని సామి సామి పాటకు మరోసారి ఇరగదీసే స్టెప్పులేసింది. అలాగే ఆస్కార్స్‌లో సత్తా చాటిన నాటు నాటు సాంగ్‌కు స్టెప్పులేసి అదరగొట్టేసింది. తమన్నా సిల్వర్ కలర్‌ డ్రెస్‌లో మెరిసిపోతూ పుష్పలోని ఊ అంటావా మావా సాంగ్‌కు మెస్మరైజింగ్ స్టెప్పులతో అదరగొట్టేసింది. వీరితోపాటు కియారా అద్వానీ కూడా స్టైలిష్ డ్యాన్స్ తో హోరెత్తించింది. రష్మిక సాంప్రదాయ ఐవరీ-బంగారు లెహంగా ధరించి, ఆమె ఎప్పటిలాగే అద్భుతంగా కనిపించింది. ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకను మందిరా బేడీ ప్రారంభించారు, గుజరాత్ టైటాన్స్- చెన్నైసూపర్ కింగ్స్ మధ్య టోర్నమెంట్ తొలి మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది.
ప్రస్తుతం వీరు చేసిన డాన్సులు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

https://youtu.be/dCQmGcNpllI