టీడీపీని నేనెప్పుడూ విమర్శించలేదు – వల్లభనేని వంశీ

టీడీపీ పార్టీ ని నేనెప్పుడూ విమర్శించలేదన్నారు వల్లభనేని వంశీ. హనుమాన్ జంక్షన్ లో ఓ క్రికెట్ టోర్నీ బహుమతి ప్రదానోత్సవానికి వల్లభనేని వంశీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందిన తర్వాత నుండి వల్లభనేని వంశీ ..పార్టీ కి దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో వైస్సార్సీపీ పార్టీ లో చేరుతారనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఆయన మాత్రం అధికారికంగా పార్టీ తీర్థం పుచ్చుకోలేదు. అలాగే పలుమార్లు చంద్రబాబు ఫై , నారా లోకేష్ ఫై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం తో ఈయన ఫై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇదిలా ఉంటె తాజాగా ఈయన టీడీపీ ఫై పాజిటివ్ గా మాట్లాడడం అందర్నీ ఆశ్చర్యంలో పడేస్తుంది.

ఆదివారం హనుమాన్ జంక్షన్ లో ఓ క్రికెట్ టోర్నీ బహుమతి ప్రదానోత్సవానికి వల్లభనేని వంశీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. విజేతలకు బహుమతులు అందజేసిన అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ టీడీపీని విమర్శించలేదని స్పష్టం చేశారు. ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ చాలా గొప్పదని అభివర్ణించారు. టీడీపీ చెడ్డదని తాను ఎప్పుడూ అనలేదని , కానీ, లోకేశ్ చేతుల్లోకి వచ్చిన తర్వాత టీడీపీ విధానాలు దెబ్బతిన్నాయని మాత్రమే విమర్శించానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వంశీ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.