పొంగులేటి తో రేవంత్ రెడ్డి భేటీ..?

బీఆర్‌ఎస్‌ బహిష్కృతనేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నట్లు సమాచారం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ నుండి వీడిన తర్వాత నుండి ఆయన ఏ పార్టీ లో చేరతారు..? అనేది సస్పెన్స్ గా మారింది. బిజెపి , కాంగ్రెస్ నేతలు వరుసగా ఆయన తో భేటీ అవుతూ వస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా తాను ఏ పార్టీ లో చేరబోయేది అతి త్వరలో హైదరాబాద్ వేదికగా ప్రకటిస్తానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపాడు.

ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో భేటీ కాబోతారనే వార్తలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి నివాసంలో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లోకి పొంగులేటి ఎంట్రీ అనేది దాదాపు ఖరారు అయినట్లే అని తెలుస్తుంది. రాహుల్ గాంధీ అమెరికా నుంచి వచ్చిన తరువాత పొంగులేటి చేరిక ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నారు.