స్పోరాడిక్ ఫీవర్

ఆరోగ్య భాగ్యం

ఏ కారణం లేకుండా రెగ్యులర్ గా, అరుదుగా, అక్కడక్కడా సింగల్ గా, అసాధారణంగా , ఎపుడో కానీ వచ్చే జ్వరాలను స్పోరా డిక్ ఫీవర్ అంటారు. ఏటికేఇ జియో గ్రాఫిక్ కాన్సెన్ట్రేషన్ ఉండదు… ఇది లాటిన్ పదం స్పోరాడికస్ నుండి వచ్చింది.. స్పోరాస్ అంటే వెదజల్లి నట్టు… గ్రీక్ పదం స్పెరైన్ పదం నుండి వచ్చింది.. దీని అర్ధం ఇక్కడ , అక్కడక్కడా చెదురు మదురుగా వచ్చే జ్వరాలు అని అర్ధం ..

fever
fever

కారణాలు:

లక్ష మందిలో ఒకరికి స్పోరాడిక్ ఫీవర్ వస్తుంది.. స్పోరాడిక్ అవుట్ బ్రేక్ ఊహించని దాని కన్నా ఎక్కువగా ఎఫెక్ట్ చేసే అవకాశం వుంది.. దీనికి ఎన్విరాన్మెంటల్, జెనెటిక్, ఇమ్మ్యూనిటి, హెల్త్ ఫాక్టర్స్, పాథో జెన్స్ విరులన్స్ , ఆహారం , నీరు, గాలి, శానిటేషన్ రోగి అలవాట్లు, కెమికల్స్ టాక్సిన్స్, రేడియేషన్ మొదలైనవి కారణం మవుతాయి.. కొన్ని సార్లు ఎటువంటి కారణం కన్పించదు… పెంపుడు జంతువులతో సన్నిహితంగా ఉండటం , వ్యాధి గ్రస్తమైన జంతువుల వలన , విదేశీ ప్రయాణాలు, ఉడకని ఆహారం, సీ ఫుడ్స్ , జింక్ ఫుడ్ , టిన్ ఫుడ్, స్టాక్ ఫుడ్ వలన కూడా వస్తుంది..

కేన్సర్

10శాతం వంశ పారంపర్యంగా వస్తే , మిగిలిన 90 శాతం కేన్సర్ రావటానికి అనేక కారణాలు ఉన్నాయి. సైనో బాక్టీరియా, ఏసస్టైన్ బార్ వైరస్, కెమికల్స్, సిగరెట్ స్మోకింగ్, డ్రగ్స్, ఆల్కహాల్, విష వాయువుల కాలుష్యం, యువ రేడియేషన్ వలనే కాకుండా , కృత్రిమ సాధనాల వలన కూడా అన్ నాచురల్ జెంటిక్ డామేజ్ కావటం వలన రొమ్ము, కోలో రెక్టర్ , లివర్, పక్రియాజ్, గర్భాశయ కేన్సర్ వస్తాయి.. పాపి ల్లొమ్మా , హెపటైటిస్ , బిపి, హెచ్ ఐవి , హెర్పిస్ వైరస్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి..

స్పోరాడిక్ అల్జిమర్స్ డిసీజ్ :

2 శాతం మందిలో ఎన్విరాన్మెంటల్, జెనెటిక్ మ్యూటేషన్ , లైఫ్ స్టైల్ అలవాట్లు, న్యూరాలిజికల్ డిసీజెస్ వలన వస్తుంది.. ఆహారం, నీరు కలుషితం కావటం వలన పాల్మొనెల్లా , ఈ కొరై ఇన్ఫెక్షన్ వలన టైఫాయిడ్ జ్వరం యుఎస్ లో స్పాండిక్ గా వచ్చింది.. ఏటా 700 కేసులు నమోదు అవుతుంటాయి.. ప్రపంచ వ్యాప్తంగా, ఏటా 27. 5 మిలియన్ల మంది బాధ పడుతుంటారు… దీన్నే స్పో రాడిక్ సాల్మోనెల్లోసిస్ అంటారు.. చిన్న పిల్లల్లో ఇది ఎక్కువగా ఉంటుంది..

డాక్టర్ కె. ఉమాదేవి, తిరుపతి

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/