ఏపీలో 42 ఏళ్ల తర్వాత.. కొత్త జిల్లాల ఏర్పాటు
వర్చువల్గా ప్రారంభించిన సీఎం జగన్

Amaravati : ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం వర్చువల్గా ప్రారంభించారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. 13 జిల్లాలను 26గా మార్పు చేస్తూ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కొత్త జిల్లాలకు శ్రీకారం చుట్టారు. ఇకపై ఏపీ రాష్ట్రంలో 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు ఉంటాయని సీఎం జగన్ చెప్పారు. ఇవాళ్టి నుంచి నుంచే కొత్త కార్యాలయాల ద్వారా సేవలందిస్తారని, ఉద్యోగులందరూ కొత్త కార్యాలయాల నుంచే కార్యకలాపాలు ప్రారంభిస్తారని, జిల్లాల ప్రజలకు, ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు ఈమేరకు సీఎం జగన్ మోహన్ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.
తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/