మొటిమలకు కారణాలు

Causes of Acne

ముఖచర్మంపై ఏదైనా అధికంగా ఒత్తిడి పెట్టినప్పుడు యాంత్రికంగా ఆ ప్రదేశంలో మొటిమలు రావచ్చు. ఉదా. వయోలిన్‌ ఉపయోగించేటప్పుడు గడ్డము, దవడలపై ఒత్తిడి పెరుగుతుంది. దాని కారణంగా మొటిమలు రావడానికి ఆస్కారం ఉంది. విపరీతంగా ఆవేశం వచ్చినపుడు అరిచేస్తుంటాం. అలాంటప్పుడు కూడా. సో ఎల్లప్పుడే ప్రశాంతంగా ఉండాలి. అరవటం వల్ల ఆవేశపడటం వల్ల ఏమి చెయ్యలేము. చేయించలేము. ఆరువందల సంవత్సరాలకి పైగా ఎంత అరచినా, గోల చేసినా రాని స్వాతంత్య్రము ఈ దేశానికి మౌనంగానే, శాంతితోనే వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి మనం అనేక రకాల ఆరోగ్య సమస్యలకి మందులు వాడుతుంటాం.

వాటి తాలూకు సైడ్‌ ఎఫెక్ట్స్‌ వల్ల కూడా రావటానికి ఆస్కారం ఉంది. డాక్టర్‌ను కలిసినప్పుడు ఈ విషయాన్ని కూడా చెప్పి మెడిసిన్‌ మార్చమని అడగొచ్చు. వీటివల్ల కూడా మొటిమలు రావచ్చు. సన్‌స్క్రీన్‌ లోషన్‌లు, మాయిశ్చరైజర్‌లు, సరైన నాణ్యత లేనప్పుడు చర్మానికి హాని చేసే మొటిమల రూపంలో రావచ్చు. మొటిమలకి ఔషధాలు ఎన్నుకున్నప్పుడు నూనె లేనివి, ఔషధ గుణాలున్న వాటిని, స్యాలిసిలిక్‌ ఆమ్లం కలిగినవి ఎన్నుకోండి. మొటిమలు రావటానికి మరొక కారణం క్లోరిన్‌ లాంటి రసాయనాలు ఉండే వాతావరణంలో ఉండటం కూడా మొటిమలు రావచ్చు.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/kids/