కురుల సంరక్షణలో ఆముదం

శిరోజాల సంరక్షణ

beauty tips- Castor oil in hair care
Beauty tips- Castor oil in hair care

ఆముదం తాగిన ముఖం అంటూ ఆముదాన్ని తేలిక చేసి మాట్లాడుతుంటాం .. కానీ శిరోజాల సమస్యలకు ఆముదం చక్కటి పరిష్కారం చూపుతుంది.. జుట్టు రాలటం, చుండ్రు వంటి ఇబ్బందులను ఆముదంతో తొలగించు కోవచ్చు.

జుట్టు రాలటం సమస్య నివారణకు:

ఒత్తు , పాడావులను బట్టి వెంట్రుకలకు సరిపడేంత ఆముదం తీసుకుని , రెండు నుంచి , మూడు చెంచాల అల్లం రసం కలిపి వెంట్రుక కుదుళ్లకు పట్టించాలి. 20 నిముషాల తర్వాత తల స్నానం చేయాలి.. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే వెంట్రుకలు రాలిపోయే సమస్య తగ్గుతుంది.

చుండ్రు నివారణకు:

సరిపడా ఆముదం, రెండు టీ స్పూన్ల కలబంద గుజ్జు, మూడు చుక్కల ట్రీ ట్రీ ఆయిల్ తీసుకోవాలి.. ఆముదంలో కలబంద గుజ్జు కలిపి, చివరగా ట్రీ ట్రీ ఆయిల్ వేసి అన్నీ కలిసేలా గిలకొట్టాలి.. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి 45 నిముషాల తర్వాత తల స్నానం చేయాలి.. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే చుండ్రు కనిపించదు..

కురులు ఒత్తుగా ఉండాలంటే:

సరిపడా ఆముదం , బాదం నూనెలను సమపాళ్లలో తీసుకునియె కలపాలి.. ఒక పెద్ద గిన్నెలో నీళ్లు మరిగించి, ఆ నీళ్లలో ఆముదం కలిపినా గిన్నెను ఉంచాలి.. గిన్నె వేడిగా మారిన తర్వాత తీసి, మూడు చుక్కల రోజ్ మేరీ ఆయిల్ కలిపి కుదుళ్లకు, వెంట్రుకలకు పట్టించాలి.. 40 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి.

ఆధ్యాత్మికం వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/devotional/