లోకేశ్ యువగళం ముగింపు సభ…టిడిపి ప్రత్యేక రైళ్లు

ప్రస్తుతం ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న పాదయాత్ర

special-trains-for-nara-lokesh-yuvagalam-victory-rally

అమరావతిః టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరి కొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో, యువగళం విజయోత్సవ సభను డిసెంబరు 20న భోగాపురం సమీపంలోని పోలేపల్లిలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు టిడిపి అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కూడా వస్తుండడంతో భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి.

పొత్తు అనంతరం చంద్రబాబు, పవన్, లోకేశ్, నందమూరి బాలకృష్ణ ఒకే వేదిక మీదికి వస్తుండడంతో ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి టిడిపి, జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో, టిడిపి 7 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ రైళ్లు డిసెంబరు 19న తిరుపతి, రైల్వే కోడూరు, మాచర్ల, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఆదోని నుంచి బయల్దేరి విజయనగరం చేరుకుంటాయి. అంతేకాదు, ఆర్టీసీ నుంచి అద్దె బస్సులు ఇవ్వాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆర్టీసీ ఉన్నతాధికారులకు లేఖ రాశారు.