సలార్ లో తన పాత్ర తాలూకా షూటింగ్ ను పూర్తి చేసిన శృతి హాసన్

బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న ప్రభాస్..ఆ తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన రెండు చిత్రాలు సాహో, రాధే శ్యామ్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయలేకపోయాయి. ప్రస్తుతం ప్రభాస్ మూడు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నప్పటికీ..అందరి కన్ను మాత్రం సలార్ పైనే ఉంది. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తుండడం తో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంత నమ్మకం తో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా తాలూకా షూటింగ్ కొంతమేర జరిగింది. ఆ తర్వాత బ్రేక్ పడింది. రీసెంట్ గా మళ్లీ మొదలుపెట్టింది. ఈ క్రమంలో హీరోయిన్ శృతి హాసన్ సినిమా తాలూకా విశేషాలను తెలుపడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

సలార్‌లో నా పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. నన్ను మీ ఆద్యగా మార్చినందుకు.. ధన్యవాదాలు ప్రశాంత్‌ నీల్ సార్‌.. మీరు అసాధారణమైన వ్యక్తి. మీ అందరితో కలిసి ఈ ప్రత్యేకమైన సినిమాకు పని చేయడం సంతోషంగా ఉంది. మీ అందరినీ ఓ కుటుంబంలా భావించానని క్యాప్షన్‌ ఇచ్చింది శృతిహాసన్‌. శృతిహాసన్ ఈ ఏడాది వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ రెండు భారీ చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదలై మంచి టాక్‌ తెచ్చుకున్నాయి. ఇక సలార్ చిత్రాన్ని కేజీఎఫ్ సినిమాను నిర్మించిన హంబుల్ నిర్మాణ సంస్థ దాదాపుగా 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుంది.