ఈటల రాజీనామాను ఆమోదించిన స్పీకర్

హైదరాబాద్: తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఈటల రాజీనామాను ఆమోదించారు. నేటి ఉదయం 11 గంటలకు ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి నేడు రాజీనామా చేశారు. గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళ్ళులర్పించిన అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మేట్‌లో ఉన్న తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. ఆ రాజీనామా పత్రాన్ని పరిశీలించిన స్పీకర్ పోచారం ఆమోద ముద్ర వేశారు.

కాగా.. అంతకుముందు, రాజీనామా సందర్భంగా ఈటల మాట్లాడుతూ, హుజూరాబాద్ లో కౌరవులకు, పాండవులకు మధ్య యుద్ధం జరగబోతోందని తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక యావత్ తెలంగాణ ప్రజలకు, కేసీఆర్ కుటుంబానికి మధ్య పోరాటం వంటిదని పేర్కొన్నారు. త్వరలో హుజూరాబాద్ లో పాదయాత్ర చేస్తానని వెల్లడించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/