సిఎం జగన్ పై విరుచుకుపడ్డ కొల్లు రవీంద్ర

అమరావతి: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర సిఎం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పన్నుల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉండగా పెట్రోల్, డీజిల్ ధరలపై అసెంబ్లీలో మొసలి కన్నీరు కార్చారని… మరి ఇప్పుడు ఎలా పెంచారని ప్రశ్నించారు. రాష్ట్ర వాటా తగ్గించుకుంటే పెట్రోల్, డీజిల్ రేటు తగ్గించుకోవచ్చు కదా అని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేసి గెలించారని వారికి పన్నుల బాదుడు బహుమతిగా ఇస్తున్నారా అని నిలదీశారు.

మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి పన్నులు 15 శాతామేగా పెంచుతున్నామని చెబుతున్నారని… 15 శాతం అంటే మీకు తక్కువగా కనిపిస్తుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాల పేరుతో ప్రజలకు ఎరా వేసి పన్నుల పేరుతో లూటీ చేస్తున్నారని ఆయన అన్నారు. మంత్రి పేర్ని నాని పన్నులు పెంచడం లేదని అంటున్నారని… మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయంలో తమ పుత్రరత్నం సమీక్షలు చేయడం ఏంటి అని ప్రశ్నించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/