స్పెయిన్ అధ్య‌క్షుడికి కరోనా పాజిటివ్‌.. జీ20 స‌మావేశాల‌కు దూరం

spain-president-pedro-sanchez-not-attending-g20-due-to-covid

మాడ్రిడ్: స్పెయిన్ అధ్య‌క్షుడు పెడ్రో సాంచేజ్‌కు క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. కోవిడ్ ప‌రీక్ష‌లో ఆయ‌న పాజిటివ్‌గా తేలారు. దీంతో ఢిల్లీలో జ‌ర‌గ‌నున్న జీ20 స‌మావేశాల‌కు ఆయ‌న హాజ‌రుకావ‌డం లేదు. ఆ దేశం త‌ర‌పున ఉపాధ్య‌క్షుడు న‌దియా కాల్వినో సాంట‌మారియా, విదేశాంగ మంత్రి జోస్ మాన్యువ‌ల్ అల్బేర్స్ ఉన్నారు. ప్ర‌స్తుతం ఆరోగ్యం బాగానే ఉంద‌ని, కానీ జీ20 మీటింగ్‌కు వెళ్ల‌డం లేద‌ని ఆయ‌న అన్నారు. ఈ స‌మావేశాల నుంచి దూరంగా ఉన్న వారి జాబితాలో పుతిన్‌, జిన్‌పింగ్‌, సాంచేజ్ ఉన్నారు. సెప్టెంబ‌ర్ 9, 10వ తేదీల్లో జీ20 స‌మావేశాల‌ను నిర్వ‌హిస్తున్నారు. సుమారు 30 దేశాల‌కు చెందిన అధినేత‌లు ఈ స‌మావేశాల‌కు హాజ‌రుకానున్నారు.