జీ20 సదస్సు..కేంద్ర మంత్రులు ఎవరు ఎవరిని ఆహ్వానించనున్నారంటే..

బైడెన్ ను స్వాగతించనున్న మంత్రి వీకే సింగ్

list-of-ministers-assigned-to-receive-world-leaders

న్యూఢిల్లీః భారతదేశం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 సదస్సు శనివారం నుంచి మొదలుకానుంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు కేంద్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. అతిథులను స్వాగతించడం నుంచి తిరిగి సాగనంపేదాకా ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంది. అవసరమైన ఏర్పాట్లతో పాటు వివిధ బాధ్యతలను ప్రధాని మోడీ కేంద్ర మంత్రులకు అప్పగించారు. దేశాల అధ్యక్షులు, ప్రధానులు సహా కీలకమైన నేతలు వస్తుండడంతో వారిని ఆహ్వానించే బాధ్యతను మంత్రులకు అప్పగించారు. ఎవరిని ఎవరు ఆహ్వానించాలనే జాబితా రూపొందించారు. అతిథులను ఆహ్వానించే విషయంలో ఆయా దేశాల సంప్రదాయాలను అనుసరించాలని, భాషా పరమైన సమస్యలను అధిగమించడానికి ఇతరత్రా సహాయానికి జీ20 మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని కేంద్ర మంత్రులకు ప్రధాని మోడీ సూచించారు.

కేంద్ర మంత్రులు ఎవరు ఎవరిని ఆహ్వానించనున్నారంటే..

వీకే సింగ్ = అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో పాటు చైనా ప్రధాని లీ క్వియాంగ్ కు స్వాగతిస్తారు
అశ్విని కుమార్ చౌబే = బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడ
శోభా కరంద్లాజే = ఇటలీ ప్రధాని జార్జియా మెలొని
దర్షన జర్దోష్ = బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
రాజీవ్ చంద్రశేఖర్ = సౌత్ కొరియా ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్
అనుప్రియా పటేల్ = ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మాక్రాన్
బీఎల్ వర్మ = జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ ష్కోల్జ్
నిత్యానంద రాయ్ = యూఏఈ ప్రెసిడెంట్ మొహమ్మద్ బిన్ జాయేద్
ఎల్ మురుగన్ = సింగపూర్ ప్రతినిధులకు ఆహ్వానం పలకనున్నారు