బాలుకి నెగటివ్‌..అసత్యమన్న చరణ్‌

బాలుకి నెగటివ్‌..అసత్యమన్న చరణ్‌
SP Balasubrahmanyam health update

చెన్నై: ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు తాజాగా నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో క‌రోనా నెగెటివ్ వ‌చ్చింద‌ని, ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉందంటూ ప‌లు వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై స్పందించిన చ‌ర‌ణ్ అవ‌న్నీ అవాస్త‌వం అని అన్నారు. నాన్న ప్ర‌స్తుతం వెంటిలేట‌ర్‌పైనే ఉన్నారు. ఆరోగ్యం కొంత నిల‌క‌డ‌గానే ఉంది. నాన్న ఆరోగ్యం గురించి నేనే ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ ఇస్తాను పుకార్లు న‌మ్మోద్దంటూ చ‌ర‌ణ్ కోరారు. కాగా బాలుకు ప్ర‌స్తుతం ఎంజీఎం వైద్యుల పర్యవేక్షణలో ఎక్మో సపోర్ట్‌తో చికిత్స జ‌రుగుతుంది కాగా, ఈ నెల 5న ఎస్పీ బాలు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. 14 వ తేదీ వ‌ర‌కు బాగానే బాలుకి ఆ త‌ర్వాత ఆరోగ్యం క్షీణించ‌డంతో 19 నుండి ఎక్మో చికిత్స మొద‌లు పెట్టారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/