నల్గొండ జిల్లా వ్యాప్తంగా ’30 పోలీస్ చట్టం’ అమలు

నల్గొండ జిల్లా వ్యాప్తంగా 30, 30 (A) పోలీస్ చట్టం 1861 నెలరోజుల పాటు అమలులో ఉంటుందని ఆ జిల్లా ఎస్పీ చందనా దీప్తి ప్రకటన చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించకూడదని స్పష్టం చేసారు. అనుమతి లేకుండా ఎలాంటి సభలు నిర్వహించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇక నల్లగొండ జిల్లా నుండే KRMB ఇష్యూపై పోరాటానికి బీఆర్ఎస్ ప్లాన్ వేస్తోంది. ఈ భారీ సభ పై ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు అధినేత కేసీఆర్. కేసీఆర్ పిలుపుతో ఈ బహిరంగ సభపై బిఆర్ఎస్ నేతలు , శ్రేణులు ఫోకస్‌ పెట్టారు. ఈ తరుణంలోనే…నల్గొండ జిల్లా వ్యాప్తంగా 30, 30 (A) పోలీస్ చట్టం 1861 నెలరోజుల పాటు అమలులో ఉంటుందని ఆ జిల్లా ఎస్పీ చందనా దీప్తి ప్రకటన చేశారు. దీంతో బీఆర్‌ఎస్‌ పార్టీ సంధిగ్ధంలో పడింది.