వర్షాల ఎఫెక్ట్ : పలు రైళ్లు రద్దు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైలు సర్వీస్ లను రద్దు చేసింది. గత నాల్గు రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు , వంకలు , చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అలాగే పలు గ్రామాల్లో , పట్టణాలలో ప్రధాన రహదారులు తెగిపోవడం తో రవాణా వ్యవస్థ స్థంభించింది. ఇదే క్రమంలో పలు రైల్వే స్టేషన్ లలో కూడా నీరు చేరడం తో పలు రైళ్ల రాకపోకలు అంతరాయం ఏర్పడుతుంది.

కాజీపేట రైల్వే స్టేషన్‌లో రైళ్ల పట్టాలపై నీరు చేరడంతో ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. ఫలితంగా ఈ రూట్లలో నడిచే మూడు రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. అలాగే 11 రైళ్లను దారి మళ్లించింది. ఇక పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లలో గోరఖ్‌పూర్‌ ఎక్స్పెస్‌ 3 గంటలకు పైగా నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.