బ్రో సూపర్ హిట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సాయిధరమ్ తేజ్ కలయికలో సముద్రఖని డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ బ్రో. తమిళంలో భారీ విజయం అందుకొన్న వినోదయ సీతమ్ సినిమా రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రియా ప్రకాశ్ వారియర్, కృతి శర్మ లు హీరోయిన్లు గా నటించగా, టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. ఓవర్సీస్ లో అర్ధరాత్రి నుండే షోస్ మొదలుకావడం తో సినిమా ఎలా ఉందనేది సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు.

బ్రో సూపర్ హిట్..పవన్ వన్ మాన్ షో..థమన్ బ్యాక్ గ్రౌండ్ కేక..ఫ్యాన్స్ కు పూనకాలే అని ప్రతి ఒక్కరు అంటున్నారు. కామెడీ, పవన్ కళ్యాణ్ మేనరిజంతో ఫస్టాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా ఉందని , ఆయన పాత సినిమాల్లో గెటప్‌లు, పాటలను సందర్భానుసారంగా తీసుకురావడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయని అంటున్నారు. సెకండ్ హాఫ్ లో సెంటిమెట్ సన్నివేశాలు ఎక్కగా ఉన్నాయని చెపుతున్నారు. ఓవరాల్ గా మూవీ అభిమానుల అంచనాలకు తగ్గట్లే ఉందని అంటున్నారు.