అర్ధమవుతోందా..

భార్యాభర్తల అనురాగం

Wife husband affection
Wife husband affection

దాదాపు ప్రతి కుటుంబంలోను ఏదో ఒక సందర్భంలో వినిపించే మాటే ఇది. కాకపోతే స్వరమే మారుతుంది. ఒక్కోసారి భర్త తనను ఏ మాత్రం పట్టించుకోవడమే భార్య అనుకుంటే, భార్య తనను అసలు పట్టించుకోవడమే మానేసిందని భర్త వాపోతుంటాడు.

అర్ధం చేసుకోవడం లేదని బాధపడే ముందు భాగస్వామికి సంబంధించిన విషయాల్లో మీకెంత అవగాహన ఉందో ఒకసారి గమనించండి. మీ భాగస్వామిని గురించి సూటిగా, సుత్తిలేకుండా మూడే మూడు ముక్కల్లో చెప్పమంటే ఏం చెబుతారు?

మీరు మొదటిసారిగా కలిసిన సందర్భం, ప్రదేశం గుర్తున్నాయా? ఆ అనుభూతిని తలచుకుంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది?

భాగస్వామి నుంచి మొదటి సారిగా అందుకున్న ఉత్తరమో, మెసేజ్‌నో ఇప్పటికీ పదిలపరచుకున్నారా? పండుగ లేదా ప్రత్యేక సందర్భాల్లో భాగస్వామికి ఎలాంటి కానుకలు ఇస్తారు? పెళ్లయిన తర్వాత మీరిద్దరూ కలిసి చూసిన మొదటి సినిమా గుర్తుందా?

మీ భాగస్వామి అభిరుచులేమిటి? తనకు బాగా నచ్చే రంగు ఏది? తన అభిమాన నటి లేదా నటుడెవరు, తనకు బాగా నచ్చిన రచయిత ఎవరు నచ్చిన పుస్తకం ఏది.

పుట్టినరోజు సందర్భంగా మీరు వేసుకున్న డ్రెస్‌ను చూసి కొలీగ్స్‌మెచ్చుకున్నారు.

వాళ్లకంటే ముందు మీ భాగస్వామి దాని గురించి ఏమన్నారో గుర్తుందా? బాస్‌ కోప్పడ్డాడని విచారంగా ఇంటి కొచ్చిన భాగ స్వామికి ఎలాంటి సాంత్వన అందిం చారు. అనుకోకుండా ఒకరోజు మీ భాగస్వామి స్నేహితులు ఇంటికి వచ్చారు. అప్పుడు మీ స్పందన ఎలా ఉంది?

మీ భాగస్వామి ఈ మధ్య మిమ్మల్ని ఏ సందర్భంలో మీరు కాస్త సాయం అందించారా. ఎలాంటి సాయం అందించారు. కాస్త దిగులుగా ఉన్న భాగస్వామిని చూసి చిరాకుపడతారా? కారణం అడిగి తెలుసుకుని పరిష్కార మార్గం చెబుతారా?

ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు చెప్పడానికి ప్రయత్నించండి. మీ పారతను నిశితంగా పరిశీలించుకోండి.

ఎక్కువ ప్రశ్నలకు సమాధానం సానుకూలంగా ఉంటే మీరు భాగస్వామిని అర్ధం చేసుకోవడంలో ముందున్నారని అర్ధం. తెలియదు, లేదు, గుర్తులేదు. వంటి సమాధానాలు ఇచ్చాయనుకోండి భాగస్వామి గురించి మీరు తెలుసుకోవల్సింది చాలా ఉందని అర్ధం.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/