జానుశీర్షాసనం
సంపూర్ణ ఆరోగ్యానికి ఆసనాలు

కాళ్లను ముందుకు చాపి, వీపును నిటారుగా ఉంచి, చేతులను పక్కకు వదిలి నేలమీద కూర్చొండి. కుడి మోకాలును మడిచి, కుడి పాదాన్ని ఎడమకాలి తొడ లోపలివైపు ఉంచండి. శ్వాస తీసుకుంటూ రెండు చేతులను పైకి ఎత్తండి.
తర్వాత శ్వాస బయటకి వదులుతూ నెమ్మదిగా ముందుకు వంగి కుడికాలి మడమను పట్టుకోండి. మీ నుదుటిని మోకాలుపైన ఉంచి, మోచేతితో నేలను తాకటానికి ప్రయత్నించండి. మామూలుగా శ్వాస తీసుకుంటూ ఆ భంగిమలో కొంతసేపు ఉండండి.
ఈ ఆసనాన్ని రెండో కాలుతో కూడా వేయండి. ఈ ఆసనం పనిచేసే ప్రాంతాలు కటి ప్రాంతం, ఉదరం. ప్రయోజనాలేమి టంటే…ఉదరం, కటి ప్రాంతాన్ని మర్దన చేస్తుంది. పొత్తికడుపులోని కొవ్ఞ్వను తగ్గిస్తుంది. వీపును వంచడానికి సాయపడుతుంది.
వెన్నుపూస స్థానభ్రంశం చెందిన వారు, హెర్నియా, తుంటి సంబంధమైన సమస్యలున్నవారు ఈ ఆసనాన్ని వేయకూడదు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/