త్వరలో 2 లక్షల మందితో కెసిఆర్‌ భారీ బహిరంగ సభ!

Soon KCR will hold a huge public meeting with 2 lakh people

హైదరాబాద్ః మాజీ సిఎం కెసిఆర్ మళ్లీ ప్రజల్లోకి రానున్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత.. మళ్లీ తొలిసారిగా కెసిఆర్ ప్రజల్లోకి రానున్నారు. నల్లగొండ జిల్లాలో కెసిఆర్ భారీ బహిరంగ సభ ఉండనున్నట్లు బిఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటించింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏదో ఒక నియోజక వర్గంలో మాజీ సీఎం కెసిఆర్ భారీ బహిరంగ సభ ఉంటుందట. ఈ నెల మూడో వారంలో కెసిఆర్ సభ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. 2 లక్షల మందితో ఫిబ్రవరి మూడో వారంలో కెసిఆర్ భారీ బహిరంగ సభ ఉంటుంది.

కృష్ణా జలాలు, కేఆర్ఎంబీ పై వాస్తవాలు ప్రజలకు వివరించడమే టార్గెట్‌గా, కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ భారీ సభ నిర్వహించనుంది.నల్లగొండ జిల్లా నుండే KRMB ఇష్యూ పై పోరాటానికి బిఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ భారీ సభపై ఇప్పటికే పార్టీ శ్రేణులకు బిఆర్ఎస్ అధినేత కెసిఆర్‌ దిశానిర్దేశం చేశారు.