శివశంకర్ మాస్టర్ కు ఆర్ధిక సాయం చేసిన సోనూసూద్

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ ప్రవైట్ హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈయన తో పాటు పెద్ద కుమారుడు , భార్య ఇలా అంత కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం వీరి బాగోగులు చిన్న కుమారుడు ఒక్కడే చూసుకుంటున్నాడు. శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి చాల విషమంగా ఉంది. దాదాపు 75 శాతం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కు గురైనట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రతి రోజు శివశంకర్ మాస్టర్ కు లక్షల్లో ఖర్చు అవుతుండడం తో..తన కుటుంబాన్ని ఆదుకోవాలని చిన్న కుమారుడు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసారు.

ఈ క్రమంలో రియల్ హీరో సోనూ సూద్ .శివ శంకర్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా సోనూసూద్ తన ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు. ” తాను ఇప్పటికే శివ శంకర్ మాస్టర్ ఫ్యామిలీ తో టచ్ లో ఉన్నాను. వారిని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. ఆందోళన అవసరం లేదు” అంటూ సోనూసూద్ ట్వీట్ చేశారు.

ఇక శివశంకర్ సినిమాల విషయానికి వస్తే..తెలుగు, తమిళ భాషల్లోని పలు పాటలకు కొరియోగ్రఫీ చేశారు. నాలుగుసార్లు తమిళనాడు స్టేట్‌ అవార్డు అందుకున్నారు. మగధీర సినిమాలో ధీర.. ధీర.. ధీర.. పాటకుగానూ 2011లో ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. డ్యాన్స్‌ మాస్టర్‌గానే కాకుండా సుమారు 30 చిత్రాల్లో నటుడిగానూ అలరించారు. అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారమైన డ్యాన్స్‌ షోలకు జడ్జ్‌గానూ వ్యవహరించారు.