తెలంగాణ ప్రజలపై కరెంట్ చార్జీల భారం: యూనిట్ కు రూపాయి పెంపు

తెలంగాణ రాష్ట్ర ప్రజల ఫై కరెంట్ చార్జీల భారం పడబోతోంది. ఎల్టీ కస్టమర్స్‌కు యూనిట్‌పై 50 పైసలు, హెచ్టీ కస్టమర్స్‌కు యూనిట్‌పై ఒక రూపాయి చొప్పున పెంచాలని ఈఆర్సీకి డిస్కమ్‌ నిర్ణయం తీసుకుంది. వీటి ద్వారా 2వేల110 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పాయి. హై టెన్షన్ వినియోగదారులకు యూనిట్ కు 1 రూపాయి పెంచాలని ERCని కోరాయి. దీని ద్వారా 4వేల 7 వందల 21 ఆదాయం రానుందన్నాయి పంపిణీ సంస్థలు. రైల్వే చార్జీలు, బొగ్గు రవాణా చార్జీలు పెరగడంతో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యమయిందని చెబుతున్నారు. గత 5 సంవత్సరాలుగా పెంచలేదని, ఇప్పుడు పెంచక తప్పదని అధికారులు పేర్కొన్నారు.

వివిధ వర్గాల నుంచి ప్రజాభిపాయసేకరణ నిర్వహించిన తర్వాత ఛార్జీల పెంపుపై ఈఆర్సీ అనుమతి ఇవ్వనుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సబ్సిడీలు కొనసాగుతాయని సీఎండీ రఘుమారెడ్డి వెల్లడించారు. ఛార్జీల పెంపుతో డిస్కంలకు రూ.6831 కోట్ల ఆదాయం రానుందని టీఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. అన్ని స్లాబుల్లో టారిఫ్​లు పెంచడం వల్ల రూ.4721 కోట్లు అదనంగా వస్తుందని అంచనా వేస్తున్నాం. రైతులకు ఎప్పటిలాగే ఉచిత విద్యుత్ అందజేస్తున్నాం. అలాగే ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్లకు వరకు ఉచితంగానే ఇస్తున్నాం. హెయిల్ సెలూన్స్, లాండ్రీలకు 250 యూనిట్ల వరకు ఉచితంగా కొనసాగిస్తాం. పవర్​ లూమ్స్, స్పిన్నింగ్ మిల్స్​కు యూనిట్​కు రెండు రూపాయల సబ్సిడీ కొనసాగుతుందని రఘురామా తెలిపారు.