ఎగ్జిట్‌ పోల్స్‌పై స్పందించిన సోనియా గాంధీ

Sonia-Gandhi-
Sonia-Gandhi

న్యూఢిల్లీః ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక ప్రకటనలో స్పందించారు. రేపు రానున్న ఎన్నికల ఫలితాలను ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ సవాల్‌ చేస్తున్నాయని అన్నారు. ఫలితాల కోసం వేచి చూడాల్సిందేనని సోనియా అన్నారు.. జస్ట్ వెయిట్ అండ్ సీ.. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న దానికి పూర్తి విరుద్ధంగా ఫలితాలు వస్తాయనే పూర్తి ఆశతో ఉన్నామని సోనియా గాంధీ పేర్కొన్నారు.

ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో 371 నుండి 401 స్థానాలను గెలుచుకునే అవకాశాలున్నాయి. దీనిలో బీజేపీకి 319 నుంచి 338 సీట్లు వస్తాయని అంచనా. ఇదే జరిగితే పార్లమెంటులో ఎన్డీఏ దాదాపు మూడు వంతుల మెజారిటీకి చేరుకుంటుంది.

కాగా, 2024 లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి. ప్రధాని మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. అయితే విపక్షాల ఇండియా కూటమి కూడా తమకు మంచి మెజారిటీ వస్తుందని చెబుతోంది.