ఊర్వశివో రాక్షసివో సెన్సార్ పూర్తి

అల్లు శిరీష్ హీరోగా నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా నవంబరు 4న థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సెన్సార్ కార్య క్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ‘యూ/ఏ’ (U/A) సర్టిఫికెట్ ను జారీ చేసారు. నేటి యువతరం భావాలకు అద్దంపట్టే అంశాలతో న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని సభ్యులు చెప్పినట్లు తెలుస్తుంది.

రీసెంట్ గా జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు నందమూరి బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా హాజరై సందడి చేసారు. తమిళ్ లో హిట్టైన ‘ప్రేమ ప్యార్ కాదల్’ ఆధారంగా ఈ సినిమా రూపొందిందనే సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ – సునీల్ – పోసాని కృష్ణ మురళి – ఆమని – శంకర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై ఈ సినిమా వస్తుండగా.. రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ తాలూకా సాంగ్స్ , టీజర్ ఆకట్టుకున్నాయి. గత కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న శిరీష్..ఈ మూవీ ఫై భారీ ఆశలే పెట్టుకున్నాడు.