అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం.. సోనియా, ఖర్గే సహా విపక్ష నేతలకు ఆహ్వానం

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం.. సోనియా, ఖర్గే సహా విపక్ష నేతలకు ఆహ్వానం అయోధ్య: అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 22న రామయ్యకు ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. రాజకీయ నాయకులతోపాటు వివిధ రంగాల ప్రముఖులకు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ఆహ్వానం అందిస్తున్నది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదురిని ఆహ్వానించినట్లు వీహెచ్‌పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్‌ కుమార్‌ చెప్పారు. వీరితోపాటు మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత దేవేగౌడను ఈ కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానం పలికామన్నారు. అదేవిధంగా త్వరలో మిగిలిన విపక్ష నేతలకు కూడా ఆహ్వానాలు అందుతాయని చెప్పారు. కాగా, ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అగ్రనేతలు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. కాగా, జనవరి 16 నుంచి 22 వరకు అయోధ్య రామాలయ ప్రారంభోత్సం వేడుకలు జరుగనున్నారు. జనవరి 22న రాములవారికి గర్భాలయంలో ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. అదేవిధంగా రాముని జీవిత విశేషాలను తెలియజేసేలా రూపుదిద్దిన 100 విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. జనవరి 15 వరకు అన్ని పనులను పూర్తిచేయాలని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు లక్ష్యంగా పెట్టుకున్నది. Sonia Gandhi, Mallikarjun Kharge invited to January 22 Ayodhya Ram temple event

అయోధ్య: అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 22న రామయ్యకు ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. రాజకీయ నాయకులతోపాటు వివిధ రంగాల ప్రముఖులకు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ఆహ్వానం అందిస్తున్నది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదురిని ఆహ్వానించినట్లు వీహెచ్‌పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్‌ కుమార్‌ చెప్పారు. వీరితోపాటు మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత దేవేగౌడను ఈ కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానం పలికామన్నారు. అదేవిధంగా త్వరలో మిగిలిన విపక్ష నేతలకు కూడా ఆహ్వానాలు అందుతాయని చెప్పారు. కాగా, ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అగ్రనేతలు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

కాగా, జనవరి 16 నుంచి 22 వరకు అయోధ్య రామాలయ ప్రారంభోత్సం వేడుకలు జరుగనున్నారు. జనవరి 22న రాములవారికి గర్భాలయంలో ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. అదేవిధంగా రాముని జీవిత విశేషాలను తెలియజేసేలా రూపుదిద్దిన 100 విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. జనవరి 15 వరకు అన్ని పనులను పూర్తిచేయాలని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు లక్ష్యంగా పెట్టుకున్నది.