లోకేష్ పాదయాత్ర ఫై మంత్రి కారుమూరి వివాదస్పద కామెంట్స్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఫై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వివాదస్పద వ్యాఖ్యలు చేసారు. లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టగానే సినీ నటి జమున మరణమని.. ఆ తర్వాత పాదయాత్రలో గుండెనొప్పితో తారకరత్న కుప్పకూలిపోయారని..ప్రస్తుతం ఆయన హాస్పటల్ లో చికిత్స పొందుతున్నాడని కారుమూరి అన్నారు.

బాబు వస్తే జాబు వస్తది అని గత ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని నిరుద్యోగులకు ఒక్క జాబు ఇవ్వలేదు..ఉద్యోగాల పేరిట యువకులను నయవంచన చేసి యువగళం పేరిట పాదయాత్ర చేయడం విడ్డూరమని మండిపడ్డారు. జాబ్ నాకు ఇచ్చావు కానీ యువకులకు ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబును లోకేష్ ప్రశ్నించాలి..సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చారన్నారు. దేశంలో చిన్న వయసులోనే పాదయాత్ర చేసి సీఎం అయిన జగన్..కులాలకు అతీతంగా అందరికీ ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్ దని కొనియాడారు.

ఇక లోకేష్ పాదయాత్ర విషయానికి వస్తే..ఈరోజు లోకేష్ యాత్ర నాల్గొవ రోజుకు చేరింది. ఈరోజు షెడ్యూల్ చూస్తే..

ఉదయం 8 గంటలకు కుప్పం నియోజకవర్గంలోని చెల్దిగానిపల్లి క్యాంపు స్థలం నుండి పాదయాత్ర ప్రారంభం.
8:45కి పలమనేరు నియోజకవర్గంలోనికి పాదయాత్ర ప్రవేశం.
9:30కి వి.కోట మండలం కెంగుటం పంచాయతీ కోరకుంటలో రెడ్డి సామాజికవర్గంతో ముఖాముఖి.
10:10కి వి.కోట మండలం పడిగల కుప్పం వద్ద మల్బరీ రైతులతో ముఖాముఖి.
10:40కి వి.కోట మండలం గాంధారమాకులపల్లెలో వడ్డెర సామాజికవర్గం ప్రజలతో ముఖాముఖి.
12:20కి వి.కోట మండలం జీఎంఆర్ కళ్యాణమండపంలో యువతతో సమావేశం.
మధ్యాహ్నం 02:05కి వి.కోట మండలం పీఎంఆర్ సత్రం వద్ద భోజన విరామం
04:15కి వి.కోట మండలం ఆఘ కళ్యాణమండపం ఎదురుగా ఉన్న స్థలంలో ముస్లిం మైనారిటీలతో ముఖాముఖి.
07:20కి వి.కోట మండలం కృష్ణపురం టోల్ గేట్ సమీపంలో రాత్రిపూట బస.