తెరుచుకున్నతాజ్‌ మహల్‌ తలుపులు

ఆగ్రా : రెండు నెలల కిందట కరోనా సెకండ్‌ వేవ్‌తో మూతపడిన చారిత్రక ప్రదేశం మళ్లీ పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నది. ఈరోజు తాజ్‌ మహల్‌ తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. ఒక ఫోన్‌ నంబర్‌ ద్వారా గరిష్ఠంగా ఐదు టికెట్లు మాత్రమే బుక్‌ చేసుకునే వీలుంటుందని, విడుతలో 650 మందిని తాజ్‌ మహల్‌ సందర్శనకు అనుమతిస్తున్నట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పేర్కొన్నారు. స్మారక ప్రాంగణంలో రోజుకు మూడు సార్లు శానిటైజేషన్‌ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. పర్యాటకులకు థర్మల్ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయడంతో పాటు సామాజిక దూరం నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టారు. అలాగే, పర్యాటకులకు తాజ్‌లో ఏ వస్తువులను తాకేందుకు అనుమతి లేదని అధికారులు చెప్పారు. పర్యాటకులు కరోనా మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని, మాస్క్‌ ధరించడం తప్పనిసరని ఏఎస్‌ఐ స్పష్టం చేసింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/