రేపు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

Sonia-Gandhi-
Sonia-Gandhi

న్యూఢిల్లీ : పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాల నేప‌ధ్యంలో పార్టీ పార్ల‌మెంట‌రీ వ్యూహ క‌మిటీ స‌మావేశాన్ని కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ చైర్మ‌న్ సోనియా గాంధీ మంగ‌ళ‌వారం ఏర్పాటు చేశారు. పార్ల‌మెంట్ ప్ర‌త్యేక సెష‌న్‌ను ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తుండ‌టంతో ఈ స‌మావేశాల్లో లేవ‌నెత్తాల్సిన అంశాలు, ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టే అస్త్ర‌శ‌స్త్రాల‌ను సిద్ధం చేసే క్ర‌మంలో పార్ల‌మెంట‌రీ వ్యూహ కమిటీ భేటీని సోనియా గాంధీ ఏర్పాటు చేశార‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. మ‌రోవైపు పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు విప‌క్ష ఇండియా కూట‌మి ఎంపీల‌తో స‌మావేశానికి కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే పిలుపు ఇచ్చారు.

కాగా, సెప్టెంబ‌ర్ 18 నుంచి 22 వ‌ర‌కూ ఐదు రోజుల పాటు పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాలు జ‌రుగుతాయ‌ని పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రి ప్ర‌హ్లాద్ జోషీ తెలిపారు. ఈ ప్ర‌త్యేక స‌మావేశాల అజెండాను ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌రకూ వెల్ల‌డించ‌లేదు. ఈ స‌మాచారాన్ని వెల్ల‌డించిన జోషీ పాత పార్ల‌మెంట్ భ‌వ‌నంతో పాటు మే 28న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్రారంభించిన నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నం ఇమేజ్‌ల‌నూ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.