జగన్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం అంటూ యూటీఎఫ్ హెచ్చరిక

‘Jagannanna Thodu’ scheme postponed
utf warns cm jagan

సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం జరుపుతోన్న చర్చలు కేవలం కాలయాపన కోసమేననీ..సీపీఎస్ రద్దుపై అధికారులు కాదు ముఖ్యమంత్రి జగనే మాకు సమాధానం చెప్పాలని యూటీఎఫ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేసారు. ఈ నెల 25న సీఎం క్యాంప్ కార్యాలయాన్ని బైకులతో ముట్టడిస్తాం అని హెచ్చరించారు. అవగాహన లేక పోతే మంత్రుల కమిటీ, ఆ తరువాత అధికారులు కమిటీ ఎలా వేశారు..? అని ప్రశ్నించారు.
అధికారంలోకి వచ్చిన వారం లోపు సీపీఎస్ రద్దు అన్నారు.. మూడేళ్లు అవుతున్న రద్దు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.

సీపీఎస్ ఫై అవగాహన లేక ముఖ్యమంత్రి వాగ్దానం చేశారని. సీఎం చుట్టూ వున్న వారు చెబుతున్నారని.. సీపీఎస్ రద్దు వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై తక్షణం ఆర్థిక భారం ఉండదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తన మాటను ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి.. మార్చి 31 లోపు రోడ్ మ్యాప్ అన్నారు అయితే నేటికి లేదనీ తేల్చి చెప్పారు. ఈ నెల 18 నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీలు 25వ తేదీన విజయవాడ చేరుతాయి…అప్పటి లోగా సీఎం నిర్ణయం తీసుకోకపోతే ఈ బైక్ లు అన్ని సీఎంవోను చుట్టు ముడతాయని హెచ్చరించారు.