ఢిల్లీలో ఆందోళనలపై సోనియా ఆవేదన

Sonia Gandhi
Sonia Gandhi

ఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక నిరసనలు తీవ్రరూపు దాల్చిన నేపథ్యంలో ఆవేదన వ్యక్తం చేశారు. మతం పేరుతో ప్రజలను విడదీసేవారిని ఉపేక్షించేది లేదని అన్నారు. మహాత్ముడు జన్మించిన దేశంలో హింసకు తావులేదని, ప్రస్తుత సంఘటనలు బాధాకరమని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలు మత సామరస్యాన్ని కొనసాగించాల్సిన తరుణమని సోనియా పేర్కొన్నారు. కాగ సోమవారం జరిగిన హింసాత్మక ఘటనల్లో రతన్‌లాల్‌ అనే పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి చెందాడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/