చైనా సరిహద్దు ప్రాంతాల్లో భారత్‌ యుద్ధ విమానాలు

చైనాపై ప్రతీకార చర్యలకు అన్నివైపుల నుంచి డిమాండ్లు

Indian fighter jets

న్యూఢిల్లీ: ఇటీవల గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలు యావత్ భారతాన్ని తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేశాయి. చైనాకు గట్టిగా బుద్ధి చెప్పాల్సిందేనన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, సరిహద్దు ప్రాంతాల్లో భారత వాయుసేన అప్రమత్తమైంది. చైనాతో సరిహద్దుల వద్ద మిరాజ్2000 యుద్ధ విమానాలను మోహరించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. పరిస్థితులను సమీక్షించేందుకు ఎయిర్ చీఫ్ మార్షల్ బదౌరియా లేహ్ లో పర్యటించారు. భారత వాయుసేన ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామన్న సంకేతాలను పంపుతోంది. లడఖ్ ఎయిర్ బేస్ లోనూ భారత యుద్ధ విమానాల కదలికలు ఊపందుకున్నాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చవేయండి:https://www.vaartha.com/andhra-pradesh/