ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా..?

prashant kishor
prashant kishor

కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం తెచ్చేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే వరుసగా సోనియా..రాహుల్ తో భేటీ అయినా ప్రశాంత్..ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది. మే 7న ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తుంది. పార్టీ లో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. జనరల్ సెక్రటరీ హోదాతో పాటు కమ్యూనికేషన్, సోషల్ మీడియా విభాగాలను ప్రశాంత్ కిషోర్ కు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 2024 లో దాదాపు గా 13 కోట్ల మంది కొత్త ఓటర్లు రానున్నారు. వారి ఆశలు, ఆశయాలకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించేలా ప్రశాంత్ కసరత్తులు చేస్తున్నారు. ప్రశాంత్‌ కిషోర్‌ తెలివైన విశ్లేషకుడని, అతన్ను చేర్చుకుంటే పార్టీకి ఖచ్చితంగా మేలు జరుగుతుందని తారిక్‌ తెలిపారు.

2024లో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 17 రాష్ట్రాల్లో 358 స్థానాల్లో ఒంటరిగా బరిలో నిలవాలని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి ప్రశాంత్‌ కిషోర్‌ సూచించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానానికి ప్రశాంత్‌ కిషోర్‌ సూచించారు. జార్ఖండ్‌లో జేఎంఎం, వెస్ట్‌ బెంగాల్‌లో TMC, మహారాష్ట్రలో NCP, తమిళనాడులో DMK, ఆంధ్రప్రదేశ్‌లో YSRCPలతో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో దిగాలని కాంగ్రెస్‌ పార్టీకి ప్రశాంత్‌ కిషోర్‌ సూచించినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు 128 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో గెలుపొందగా..249 స్థానాల్లో రెండో స్థానంలో ఉన్నట్టు పవర్‌ పాయింట్‌ ప్రజేంటేషన్‌లో కాంగ్రెస్‌ నేతలకు ప్రశాంత్‌ కిషోర్‌ వివరించారు. బీజేపీతో పోటాపోటీగా ఉండే రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని సూచించినట్లు తెలుస్తుంది.