రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది

నాపై కక్షతో కుప్పంకు నీళ్లు రానివ్వకుండా చేస్తున్నారు

chandrababu naidu
chandrababu naidu

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. టిడిపి హయంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయని..వైఎస్‌ఆర్‌సిపి హయంలో అవన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయన్నారు. నేడు ఆయన చిత్తూరు జిల్లా టిడిపి కార్యకర్తలతో సమవేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..ముఖ్యమంత్రి జగన్‌ మూర్ఖుడిగా, సైకోలాగా మారిపోయారన్నారు. తనపై కక్షతో కుప్పంకు నీళ్లు రానివ్వకుండా చేస్తున్నారని విమర్శించారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులన్నింటినీ ఆపేశారన్నారు. మీడియాపైన కేసులు పెట్టిస్తున్న ఒకే ఒక వ్యక్తి జగన్‌ అని చంద్రబాబు దుయ్యబట్టారు. సోషల్‌ మీడియాలో టిడిపిపై బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాన్ని కుప్పం నుంచే ప్రారంభిస్తామన్నారు. అమరావతి అభివృద్ధి కోసం యువత పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/