మున్సిపల్‌ బడ్జెట్‌లో 10 శాతం పచ్చదనం కోసమే వాడాలి

80 శాతం మొక్కలు బతికించకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం

K. T. Rama Rao
K. T. Rama Rao

నల్లగొండ: దేవరకొండ మున్సిపాలిటీలో పరిస్థితి బాగా మెరుగుపడాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మున్సిపల్ బడ్జెట్లో 10 శాతం కేవలం పచ్చదనం కోసమే ఉపయోగించాలన్నారు. 80 శాతం మొక్కలు బతికించకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేవరకొండలో పట్టణ ప్రగతిలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వార్డుల్లో మొక్కల పెంపకానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తాగునీటి నిర్వహణ వ్యవస్థపై వార్డు సభ్యులు సమీక్షించాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పరీక్షలు జరిపి సురక్షితమైన నీరందించాలన్నారు. నల్లా కనెక్షన్లకు మీటర్లు బిగించాలని పేర్కొన్నారు. కూరగాయల మార్కెట్, పార్క్, శ్మశానవాటికలు నిర్మించాలన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/