కన్న తండ్రిని కడతేర్చిన కొడుకు

Crime in karimnagar
Crime in karimnagar

కరీంనగర్‌: కనిపెంచిన కన్న కొడుకే అతడి పాలిట కాలయముడయ్యాడు. కన్న తండ్రి అని కూడా చూడకుండా అత్యంత పాశవికంగా కడతేర్చిన ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వివరాల్లోకెళితే.. కన్న తండ్రిని కొడుకే కడతేర్చిన దారుణ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టులో చోటుచేసుకుంది. కుటుంబంలో చోటుచేసుకున్న కలహాలు ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా భీందేవరపల్లి మండలం కొత్తకొండకు చెందిన సయ్యద్ కొత్తగట్టులో కుటుంబంతో పాటు ఉంటున్నాడు. అయితే, కుటుంబంలో గొడవలు తలెత్తి తారాస్థాయికి చేరడంతో, విచక్షణ కోల్పోయిన కొడుకు ఖాసీం తండ్రి తలపై బండ రాయితో మోదాడు. దీంతో సయ్యద్ మృతి చెందాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ హత్యకు గొడవలే కారణమని స్థానికులు చెబుతున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/