టోక్యో ఒలింపిక్స్‌లో పతకమే నా లక్ష్యం
క్రీడలను ప్రోత్సహిస్తున్న రాష్ట్రా ప్రభుత్వాలకు కృతజ్ఞలు

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ పీవీ సింధు ఇటీవలే పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం పీబీఎల్‌లో హైదరాబాద్ హంటర్స్ జట్టులో ఆడుతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చిన్న వయసులోనే ఇంతటి గొప్ప అవార్డుకు ఎంపికవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. పద్మభూషణ్ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని చెప్పారు. క్రీడలను విశేషంగా ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల సర్కారులకు కృతజ్ఞతలు చెప్పారు. టోక్యో వేదికగా ఒలింపిక్స్ లో పతకం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నానని, ఒలింపిక్స్‌కు ఎక్కువ సమయం లేకపోవడంతో ఆడే ప్రతి టోర్నిలో రాణించేందుకు కృషి చేస్తున్నాని పీవీ సింధు తెలిపారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/