రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

రేపు ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌

హైదరాబాద్: స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా రేపు పబ్లిక్‌ గార్డెన్స్‌లో ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో పబ్లిక్‌గార్డెన్స్‌ పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. కారు పాసు ఉన్న వారికి లోపలికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.


ఈ నెల 11వతేదీ రాత్రి షబ్‌-ఏ-మేరాజ్‌ (జాగారం) ఉన్నందున రాత్రి 10గంటల తర్వాత అన్ని ఫ్లైఓవర్లు మూసి ఉంటాయని సీపీ తెలిపారు. అయితే పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్‌ వే, లంగర్‌హౌజ్‌ ఫ్లైఓవర్‌, గ్రీన్‌ల్యాండ్స్‌ ఫ్లైఓవర్లపై మాత్రం అనుమతి ఉంటుందని ఆయన వెల్లడించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/