మత ప్రాతిపదికన దేశాన్ని ముక్కలు చేయకూడదు

సీఏఏకు వ్యతిరేకంగా బిజెపి ఎమ్మెల్యే వ్యాఖ్యలు

narayan tripathi
narayan tripathi

భోపాల్‌: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మొదటిసారిగా బిజెపి ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే నారాయణ్  త్రిపాఠి సీఏఏని వ్యతిరేకించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మత ప్రాతిపదికన దేశాన్ని ముక్కలు చేయకూడదని అన్నారు. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగాన్ని గౌరవించడం లేదా దాన్ని చింపివేయడం ఏదో ఒకటి మనం చేయాలని అన్నారు. ఆధార్‌ కార్డు కోసమే పల్లెలు, పట్టణాలలోని సామాన్య ప్రజలు కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారని, ఇక పౌరసత్వం కోసం అనేక పత్రాలను సమకూర్చుకోవడం వారికి అసాధ్యమని త్రిపాఠి చెప్పారు. సీఏఏతో దేశంలో అంతర్యుద్ధ వాతావరణం ఏర్పడిందని, దేశంలో ఒకరినొకరు చూసుకోవడం మానుకున్నారని అన్నారు. ఒక దేశంలో అంతర్యుద్ధం ఏర్పడితే అక్కడ శాంతి నెలకొనడం అసాధ్యమని అన్నారు. ఒక పక్క మన దేశం వసుదైక కుటుంబకం అని చెబుతూ మరోపక్క దేశాన్ని మతాల పేరుతో చీలుస్తున్నారని త్రిపాఠి ఆవేదన వ్యక్త చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/