ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు బ్రేక్

ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ వద్ద ఏర్పటు చేసిన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి బ్రేక్ పడింది. ఈ నెల 28న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది.
శ్రీకృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని భారత యాదవ సమితి, ఇతరులు వేసిన పిటిషన్లను జస్టిస్ కే లక్ష్మణ్ గురువారం విచారణ చేపట్టారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, నిర్వాహకులను ఆదేశించిన హైకోర్టు విచారణను జూన్ 6కు వాయిదా వేసింది.