హైదరాబాద్ మందు బాబులకు బ్యాడ్ న్యూస్..

హైదరాబాద్ లోని మందు బాబులకు బ్యాడ్ న్యూస్. ఏప్రిల్ 06 హనుమాన్ జయంతి సందర్బంగా హైదరాబాద్ లో వైన్ షాప్స్ బంద్ కాబోతున్నాయి. ఈ మేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వైన్ షాపులు, బార్లు, పబ్‌లు ఏప్రిల్ 6వ తేదీన బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరమంతా భారీ ర్యాలీలు జరుగుతాయి. ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు.. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తారు. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైన్ షాపులు, బార్లు, పబ్ లు మూసేయాలని పోలీసులు ఆదేశించారు. ఈనెల 6న ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.