దాదాపు 50 మంది వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు – RRR

తెలంగాణ లో ఎన్నికల ఘట్టం ముగిసింది..భారీ మెజార్టీ తో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వం నెలకొల్పింది. ఇక ఏపీ లో ఏంజరగబోతుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరో రెండు , మూడు నెలలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఏ పార్టీ గెలవబోతుందా అని ఇప్పటి నుండే లెక్కలు వేసుకోవడం మొదలుపెట్టారు. ఈసారి జగన్ గెలవడం కష్టమే అని పలు సర్వేలు చెపుతున్నాయి. ఇదే విషయాన్నీ ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు సైతం పలుమార్లు చెప్పుకొచ్చారు.

తాజాగా ఆయన మాట్లాడుతూ..జనవరి నాటికీ దాదాపు 50 ఎమ్మెల్యే లు వైస్సార్సీపీ ని వీడబోతున్నారని తెలిపి షాక్ ఇచ్చారు. కృష్ణా జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారని తెలిపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, శాసనసభ సభ్యత్వానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేయడంతో పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ మాకొద్దు బాబోయ్ అంటే… మాకొద్దని ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటున్నారంటే, వైసీపీ మునిగిపోయే పడవని వారికి అర్థమైందని అన్నారు. ప్రజా తీర్పు అధికార వైసీపీ కి వ్యతిరేకమని తేలడంతో, చిల్లుపడ్డ పడవ నుంచి దూకి ఒడ్డుకు చేరుకునేందుకు వారంతా ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతోందని అన్నారు.